: టీఆర్ఎస్ కు షాక్... మత్స్య సొసైటీని గెలుచుకున్న టీడీపీ!


జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గణపసముద్రం సరస్సు మత్స్య సొసైటీ ఎన్నికల్లో అధ్యక్ష పదవిని టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మత్స్య సొసైటీ ఎన్నికల్లో టీడీపీ వరుసగా మూడోసారి గెలుపొందింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు సొంత మండలం కావడంతో... ఇక్కడ టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ... ప్రయోజనం లేకపోయింది. విజయం అనంతరం కొత్త కమిటీతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, ఊరేగింపు నిర్వహించి, సంబరాలు జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News