: గుర్మీత్ సింగ్ డేరాలో హైదరాబాద్ యువకుడు.. తల్లిదండ్రుల వెతుకులాట!
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరాలో హైదరాబాదుకు చెందిన ఓ యువకుడు నివసిస్తున్న విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, నగరానికి చెందిన షాబాద్ అనే యువకుడు 2009 నుంచి కనిపించకుండా పోయాడు. అయితే, డేరా బాబాకు కోర్టు శిక్షను విధించిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ విధ్వంసాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. టీవీలో ఈ అల్లర్లను వీక్షించిన షాబాద్ తల్లిదండ్రులు... అల్లర్లకు పాల్పడుతున్న వారిలో తమ కుమారుడు కూడా ఉన్నాడనే విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో నిన్న వారు సిర్సాలో ఉన్న డేరాకు చేరుకున్నారు. తమ కుమారుడు టీవీలో కనిపించాడని... ఎవరికైనా తమ కుమారుడు తెలిస్తే చెప్పాలంటూ అక్కడ కనిపించిన వారినందరినీ వేడుకుంటున్నారు.