: కనిపించకుండా పోయిన సోనియాగాంధీ కమెండో.. చివరకు ఎలా కనిపించాడో చూడండి..!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇంటి వద్ద రక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్పీజీ కమెండో రాకేశ్ కుమార్ వారం క్రితం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆయన అదృశ్యం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే, ఆయన ఢిల్లీలోని లూటియన్స్ ప్రాంతంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో తిరుగుతున్నట్టు గుర్తించారు. ఆయనను పట్టుకున్న పోలీసులు... చివరకు అసలు విషయం తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు.
అసలు ఏం జరిగిందంటే... అతని పేరు మీద రూ. 4 లక్షల లోన్ ఉంది. ఆగస్ట్ 31న తన వద్ద ఉన్న రూ. 40 వేలు ఇన్ స్టాల్ మెంట్ కింద కట్టేశాడు. ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో... ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి ఓ వారం పాటు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ధనవంతులు ఉండే లుటియన్స్ ప్రాంతంలోని పార్కుల్లో తిరుగుతూ గడిపాడు. చివరకు తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక అడుక్కుంటుండగా... ఓ వ్యక్తి కంట పట్టాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించడంతో... పోలీసులు వచ్చి, అతడిని తీసుకువెళ్లి, వైద్య పరీక్షలు చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో, కథ సుఖాంతమైంది.