: మైసూరుకు మార్చిన దినకరన్ క్యాంపు రాజకీయం... పళని స్వామి ధీమా
తమిళనాడు క్యాంపు రాజకీయాలు కర్ణాటకకు చేరాయి. తన వెంట వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేజారిపోవడంతో ఆందోళన చెందిన టీటీవీ దినకరన్ అప్రమత్తమయ్యారు. తన ఎమ్మెల్యేలను ఏపీకి తరలిస్తానని లీకులిచ్చిన దినకరన్.. తన మకాం మైసూరుకు మార్చారు. రిసార్ట్ ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా, బలపరీక్షను ఎదుర్కొనేందుకు పళని సర్కారుకు ఇద్దరు ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా, తమిళనాడు అసెంబ్లీలో ముగ్గురు తటస్తులు ఉన్నారు. వారిలో ఇద్దర్ని తనవైపు ఆకర్షించగలిగితే బలపరీక్షలో పళని వర్గం విజయం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అందుబాటులో లేకున్నా తమకు వచ్చిన నష్టం ఏదీ లేదని వారు చెబుతున్నారు.