: టీడీపీలో చేరబోతున్న వైసీపీ నేత.. కర్నూలు జిల్లాలో ఉత్కంఠ!


ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ టికెట్ ను ముఖ్యమంత్రి ఎవరికి కేటాయించనున్నారో అనే విషయం ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే ఎంపీ ఎస్సీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. మరో కీలక నేత కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీకి చెందిన ఓ కీలక నేత టీడీపీలో చేరనున్నారనే వార్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబుతో ఆయన మంతనాలు సాగించారని... ఎమ్మెల్సీ టికెట్ కావాలని అడిగారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ను ఆయనకే ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో, చంద్రబాబు పర్యటన ఉత్కంఠభరితంగా మారింది.

  • Loading...

More Telugu News