: చలానా రాశాడని ట్రాఫిక్ పోలీసు బొటన వేలు కొరికి, యూనిఫాం చింపి, హెల్మెట్‌తో దాడిచేసిన ద్విచక్ర వాహనదారుడు!


ట్రాఫిక్ కానిస్టేబుల్ చలానా రాసిన పాపానికి అతడి బొటనవేలు కొరికేసి పారిపోయాడో బైకర్. ఢిల్లీలో జరిగిందీ ఘటన. నగరంలోని సీమాపురిలో ఓ బైకర్ రెడ్ సిగ్నల్ జంప్ చేశాడు. గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడి వద్దకు వెళ్లి బైక్ పత్రాలు చూపించాల్సిందిగా అడిగాడు.

అంతే.. రెచ్చిపోయిన వాహనదారుడు కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డాడు. హెల్మెట్‌తో అతడిపై దాడిచేశాడు. అతడి యూనిఫాంను చింపేశాడు. అతడి బొటన వేలిని కొరికేశాడు. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల కానిస్టేబుల్ ఆసుపత్రిలో చేరాడు. అతడి నుదిటిపై కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘజియాబాద్‌కు చెందిన 40 ఏళ్ల దిలావర్ చౌదరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News