: సావిత్రి చివరి రోజుల్లో కార్ల షెడ్డులో జీవించింది: ఆరుద్ర సతీమణి రామలక్ష్మి


తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఏ హీరోయిన్ అయినా సావిత్రిలా పేరుతెచ్చుకోవాలని కోరుకుంటుంది. సావిత్రిని నటనకు డిక్షనరీగా చెబుతుంటారు. అలాంటి సావిత్రి జీవితంలో ఉచ్ఛ,నీచాలు చవి చూసిందని చెబుతుంటారు. తాజాగా 'స్ట్రెయిట్ టాక్ విత్ తెలకపల్లి షో'లో ప్రముఖ రచయిత్రి, పాటల రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి రామలక్ష్మి సంచలన విషయాలు వెల్లడించారు.

సావిత్రి చివరి రోజుల్లో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించారని ఆమె తెలిపారు. చివరి రోజుల్లో సావిత్రి కారు షెడ్డులో జీవించారని ఆమె తెలిపారు. కాగా, తమిళనటుడు జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె చేతికి ఎముక లేదని, ఆశ్రయించిన వారిని ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరని ఆమె పేరు సంపాదించారు. అదే సమయంలో కుటుంబ సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో జారుకుని, ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతుంటారు. తాజాగా రామలక్ష్మి వెల్లడించిన వివరాలు సావిత్రి అభిమానులను ఆవేదనకు గురి చేశాయి. 

  • Loading...

More Telugu News