: సుద్దులు చెబుతున్న పాక్ ఆర్మీ చీఫ్!


'అవును, మా దగ్గర ఉగ్రవాద సంస్థలున్నాయి. అయినా వాటిని మేము నియంత్రించే ప్రయత్నంలో ఉన్నా'మని ప్రకటన చేసిన పాకిస్థాన్... భారత్ సరిహద్దుల్లోకి నిత్యం ఉగ్రవాదులను పంపుతూ అరాచకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కరుడుగట్టిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల ప్రకటించారు. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ తన ఉగ్రవాద సంస్థను రాజకీయ పార్టీగా మార్చి అధికారం పొందాలని తహతహలాడుతున్నాడు.

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ మాట్లాడుతూ, ‘‘పాకిస్థాన్‌ ను తిట్టడం కంటే కశ్మీరు అంశాన్ని భారత్‌ రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి. నియంత్రణ రేఖ వద్ద భారత్‌ అమాయక ప్రజలను చంపుతోంది. శాంతికి భారత్‌ ఒక అవకాశం ఇవ్వాలి’’ అంటూ నీతి వాక్యాలు వల్లించడం విశేషం. 

  • Loading...

More Telugu News