: ఢిల్లీలో ల్యాప్ ట్యాప్ లు కేజీల లెక్కన అమ్ముతారన్న సంగతి మీకు తెలుసా?
ఫెస్టివల్ సేల్ పేరుతో చీరలను కేజీల లెక్కన అమ్ముతామన్న ప్రకటనలు అప్పుడప్పుడు పత్రికల్లో, పాంఫ్లేట్లలో చూస్తుంటాం. కానీ ల్యాప్ ట్యాప్ లు కేజీల లెక్కన అమ్ముతామన్న మాట ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా?.. . ల్యాప్ ట్యాప్ లు కేజీల లెక్కన అమ్మడమా? అన్న అనుమానం వచ్చిందా? అవును అమ్ముతారు. అది కూడా ఎక్కడో కాదు...మన రాజధాని ఢిల్లీలోనే...ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ల్యాప్ టాప్ మార్కెట్ లో సరసమైన ధరకే ల్యాప్ ట్యాప్ లు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ల్యాప్ ట్యాప్ లను కేజీల లెక్కన అమ్ముతారు.
కేవలం 5 నుంచి 7 వేలకే ఒక ల్యాప్ ట్యాప్ కొనుక్కో వచ్చంటే అతిశయోక్తి కాదు. అయితే మీకు ల్యాప్ ట్యాప్ మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మీరు ఇంటికొచ్చిన తరువాత ల్యాప్ ట్యాప్ ఖాళీ డబ్బాగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేవలం ల్యాప్ ట్యాప్ లు మాత్రమే కాదు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్, మొబైల్ యాక్ససరీస్ కూడా తక్కువ ధరలలో లభిస్తాయి. అయితే వాటిని ఒకటికి రెండు సార్లు పరీక్షించి మరీ తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడికి చేదు అనుభవం మిగులుతుంది.