: గౌరీ లంకేశ్ హత్య ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్


బెంగళూరులో సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు గురి కావడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆమె హత్య వెనుక హిందుత్వ శక్తులున్నాయంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. చేతిలో పెన్నుతో సామాజిక న్యాయం, నిబద్ధత కోసం మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నవ్యక్తి భావస్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు..ఉన్న మన దేశంలో ఓ జర్నలిస్టు హత్యకు గురికావడం దారుణమని, ఈ సంఘటన ద్వారా మన జాతి నిర్మాతల స్ఫూర్తిని హతమార్చినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకు గల కారణాలు తెలుసుకోకుండా, దీని వెనుక హిందుత్వ శక్తులు ఉన్నాయని ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఒక గౌరీ లంకేశ్ ను హత మార్చడం ద్వారా ‘మిలియన్ల గౌరీలు’ పుట్టుకొస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కోరారు.

  • Loading...

More Telugu News