: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలంటూ జగన్ పిటిషన్..సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు
అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. రాంకీ,వాన్ పిక్, జగతి పెట్టుబడుల కేసుల్లో ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే, జగతి పబ్లికేషన్ పెట్టుబడుల కేసులో సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై సీబీఐ కోర్టులో రేపు విచారణ జరగనుంది. కాగా, ఇదే అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇటీవలే డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా సీబీఐ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది.