: దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన సమంత
తెలంగాణలో చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా ఉన్న సినీ నటి సమంత ఈ రోజు సిద్దిపేటలోని దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మాట్లాడి వారి పనితీరును గురించి అడిగి తెలుసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపింది. ఆధునిక వస్త్రధారణకు అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించి కార్మికులకు బాసటగా నిలుస్తానని తెలిపింది.