: ఈ రంగంలో మంచి స్కోరు చేయలేకపోయా: సచిన్ టెండూల్కర్


‘మాస్టర్ బ్లాస్టర్’, ‘క్రికెట్ లెజెండ్’, క్రికెట్ దిగ్గజం’, ‘క్రికెట్ దేవుడు’ అనే పేర్లతో తమ అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్, చదువులో మాత్రం అంత ఎక్కువ మార్కులు సంపాదించలేకపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా సచినే చెప్పాడు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ తో పాటు చిన్నారి సచిన్ పుస్తకం చదువుతున్న ఓ ఫొటోను జతపరిచాడు.

‘ఈ రంగంలో నేను అంతగా మంచి స్కోర్ చేయలేకపోయా’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను సచిన్ పోస్ట్ చేశాడు. ఇక, ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఊరుకుంటారా! తమ దైన శైలిలో ప్రశంసలు కురిపించారు. ‘మీరు ఈ రంగంలో రాణించలేకపోవచ్చు. కానీ, మరో రంగంలో దేవుడిగా కీర్తించబడుతున్నారు’, ‘నాడు స్మాల్ స్కూటీపై కూర్చుని పుస్తకం చదువుతున్న మీరు, నేడు ‘ఫెరారి’లో తిరుగుతానని ఎప్పుడైనా ఊహించారా? ఇదంతా కేవలం నలభై ఏళ్లలో జరిగింది...హ్యాట్సాప్ టూ యు!’, ‘క్రికెట్ దిగ్గజం ఫొటోలలో ఒక ఉత్తమ చిత్రం’ అంటూ నెటిజన్లు తమ ప్రశంసాపూర్వక పోస్ట్ లు చేశారు.

  • Loading...

More Telugu News