: ఆఫ్ఘనిస్థాన్ కు మరో 3,500 మంది సైనికులను పంపిస్తున్నాం: అమెరికా


ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోబోమంటూ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న చేసిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి మరో 3,500 సైనికులను పంపుతాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. చెప్పిన‌ట్లుగానే అందుకు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్ప‌టికే 14,500 మంది ఆమెరికా సైనికులు వున్నారని, ఇప్పుడు కొత్త‌గా 3,500 మందిని పంపిస్తున్నామ‌ని రక్షణశాఖ మంత్రి జేమ్స్ మాటిస్‌ అన్నారు.

 త‌మ‌దేశ ప్ర‌జ‌ల‌ ప్రయోజనాలకు అనుగుణంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. తీవ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్‌లో స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసుకుని దాడుల‌కు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాయ‌ని చెప్పారు. ఆ దేశంలో త‌మ‌ సైనికుల మోహ‌రింపు కోసం అవసరమైన నిధుల మంజూరు కోసం త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌ సమావేశమవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News