: ఎవరెంత అడ్డుకునే ప్రయత్నం చేసినా కొత్త సచివాలయాన్ని ఆపే ప్రసక్తే లేదు: కర్నె ప్రభాకర్


ఎవరెన్ని కుట్రలు చేసినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా కొత్త సచివాలయం నిర్మాణాన్ని నిర్మించి తీరుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో కనీస సదుపాయాలు కూడా లేవని... ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే, ఫైరింజన్ తిరిగేందుకు కూడా సరిపడా స్థలం లేదని అన్నారు. ప్రస్తుత సచివాలయంలో విధులను నిర్వహించేందుకు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని విపక్ష నేతలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News