: హైద‌రాబాద్‌లో అతి పెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన అమెజాన్‌!


అమెజాన్ సంస్థ హైద‌రాబాద్‌లో అతి పెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించింద‌ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 1.3 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో, 1.6 కిలో మీట‌ర్ల కన్వేయర్ బెల్ట్‌తో ఈ సెంట‌ర్ ప్రారంభ‌మైంద‌ని చెప్పారు. అమెజాన్ కు సంబంధించిన ప‌లు ఫొటోల‌ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తోన్న నెటిజ‌న్లు ఇది గుడ్ న్యూసే కానీ, అమెజాన్‌లో ఉద్యోగాల భ‌ర్తీ ఎప్పుడు చేస్తార‌ని అడుగుతున్నారు.    

  • Loading...

More Telugu News