: 'లాల్ బాగ్చా' గణేశుడుకి భారీగా బంగారు కానుకలు!


వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతి ఏటా ఏర్పాటు చేసే గణేశుడి విగ్రహం ప్రత్యేకత వేరు! అదే మాదిరి, ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశ్ కూడా. ఈ గణేశుడి నిమజ్జనం నిన్న జరిగింది. ఇక్కడ కూడా గణేష్ వేడుకలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి, ముంబైలో భారీ వర్షాల కారణంగా మొదటి ఆరు రోజులు భక్తులు అంతగా రాలేదు. ఆ తర్వాత మాత్రం భక్తులు భారీ సంఖ్యలో లాల్ బాగ్చా గణేశ్ ని  దర్శించుకున్నారు.

భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకోవడమే కాదు, అదే స్థాయిలో కానుకలు కూడా సమర్పించుకున్నారు. దీంతో ఈ ఏడాది లాల్ బాగ్చా గణేశుడుకి రెండున్నర కేజీలకు పైగా బంగారు కానుకలు లభించాయి. అందులో, ఒక కిలో బరువు ఉన్న బంగారు ఇటుక, మరో కేజీ బరువు గల గణపతి, లక్ష్మి బంగారు విగ్రహాలు,  పావు కిలో బరువు తూగే బంగారు మోదక్ తో పాటు మరెన్నో బంగారు వస్తువులు, వెండి వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా, రూ.5 కోట్ల నగదు కూడా ఆయనకు కానుకలుగా భక్తులు సమర్పించినట్టు లాల్ బాగ్చా గణేశ్ అసోసియేషన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News