: లాలూ ప్రసాద్, తేజస్వీలకు సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు


ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ లకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే హోటళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే కేసులో లాలూకు సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 11న లాలూ ప్రసాద్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఆయన కుమారుడిని మరుసటి రోజు విచారించనున్నారు. 2006లో రైల్వే శాఖలో నిర్వహించిన టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ లాలూపై ఆరోపణలు ఉన్నాయి. రాంచి, పూరీలోని రైల్వే హోటళ్ల విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా లాలూ టెండర్లను కేటాయించినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఆయన ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. 

  • Loading...

More Telugu News