: కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రికి మూఢ నమ్మకాలు ఎక్కువయ్యాయని... ఆ నమ్మకాలతోనే మైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. సచివాలయం నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తారా? లేక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తారా? చెప్పాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News