: కోయంబ‌త్తూరులో కూలిన బ‌స్టాండ్ శ్లాబ్‌.. 9 మంది మృతి!


త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. అక్క‌డి సోమ‌నూర్‌లో బ‌స్టాండ్ శ్లాబ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో 9 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంత మందికి గాయాలు అయి ఉండ‌వ‌చ్చ‌ని అక్క‌డి అధికారులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌యత్నం చేస్తున్నారు. ప్ర‌మాద స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.      

  • Loading...

More Telugu News