: దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి రిజర్వేషన్లే కారణం: కేంద్రమంత్రి రాందాస్
దేశంలో రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి రాందాస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అత్యాచారాలు తగ్గాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలని అన్నారు. రిజర్వేషన్ సమస్యల కారణంగానే దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యూపీ తొలిస్థానంలో ఉండగా, తెలంగాణ 5వ స్థానంలో ఉందని అన్నారు.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 913 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయని రాందాస్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. కాగా, కర్ణాటకలో జర్నలిస్ట్ హత్యను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ హత్య కేసులో బీజేపీపై విమర్శలు చేయడం తగదని అన్నారు.