: అత్యధిక వ్యూవర్ షిప్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్'ది కాదు... 'కుంకుమపువ్వు' సీరియల్ ది!


గత నెల 19 నుంచి 25 వరకూ తెలుగు టీవీ చానల్స్ లోని టాప్ కార్యక్రమాల వివరాలను బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీఏఆర్సీ) విడుదల చేయగా, మాటీవీలో ప్రసారమవుతున్న 'కుంకుమపువ్వు' సీరియల్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీరియల్ కు 8,502 టీఆర్పీ ఇంప్రెషన్స్ వచ్చాయి. రెండో స్థానంలో జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే 'టీఈఎఫ్ఎఫ్-డబ్ల్యూటీపీ- విన్నర్' నిలువగా, మూడో స్థానంలో జెమినీలో ప్రసారమయ్యే 'మెక్ డొవెల్ నంబర్ వన్ యారీ విత్ రానా', నాలుగో స్థానంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'స్వాతి చినుకులు' సీరియల్, ఐదో స్థానంలో జీ తెలుగులో ప్రసారమయ్యే 'ముద్దమందారం' సీరియల్ నిలిచాయి.

ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న 'బిగ్ బాస్'కు టాప్-5 లో స్థానం లభించలేదు. తెలుగు టీవీలు ఇస్తున్న కార్యక్రమాల్లో అత్యధికులు చూస్తున్నది 'బిగ్ బాస్' అయితే, దానికి తొలి స్థానం లభించక పోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్న వేళ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ తదితరాలకు మార్కెటింగ్ పీఆర్ గా ఉన్న మహేష్ ఎస్ కోనేరు వివరణ ఇచ్చారు. 'బిగ్ బాస్' రిపీటెడ్ అవుతుందని, ఆ కారణంగానే అత్యధికులు వీక్షిస్తున్నా, సరాసరి రేటింగ్ తగ్గిన కారణంగా ర్యాంకు లభించలేదని అన్నారు. తారక్ వీకెండ్ ఎపిసోడ్స్ కు 9.9 సరాసరి టీఆర్పీ ఉందని స్పష్టం చేశారు.


  • Loading...

More Telugu News