: ముఖ్యమంత్రి పదవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు!


ప్రస్తుతం తన అసెంబ్లీ నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజా సమస్యలు తీర్చడంపై దృష్టిని సారించిన హీరో నందమూరి బాలకృష్ణ, సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనో, మంత్రి కావాలనో ఎటువంటి ఆశలూ లేవని స్పష్టం చేశారు. పెద్ద పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. ఇక్కడున్న సమస్యల్లో కొన్ని తన దృష్టికి వచ్చాయని, ఇక్కడి ప్రజల ప్రతినిధిగా వాటిని పరిష్కరించడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. ఆపై తెలుగుదేశం పార్టీకి అవసరమైన సేవలను అందిస్తానే తప్ప ముఖ్యమంత్రి పదవి పొందాలని ఎన్నడూ అనుకోనని తెలిపారు.

  • Loading...

More Telugu News