: మహిళా పోలీసును పదేపదే అసభ్యంగా తాకిన అసిస్టెంట్ కమిషనర్... వైరల్ అయిన వీడియో!


తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన కోయంబత్తూరులో నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న వేళ, ఓ మహిళా పోలీసుతో అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారి అత్యంత అసభ్యంగా తాకుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరుగుతుండగా, ఆ మహిళా పోలీసు గుండెలపై ఆయన చేయివేసి పదే పదే తాకి వెనక్కు నెడుతూ వుండడం.., ఆమె ఇబ్బందిగా ఫీలౌతూ ఆయన చేతిని తప్పించే ప్రయత్నం చేయడం.. అయినా వెనక్కు తగ్గక పదేపదే ఆమెను అభ్యంతరకరంగా తాకుతున్నట్టు వుండడం కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన వారు అధికారి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News