: కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భీకర ఫామ్ కు ఒక్కో రికార్డు దాసోహమవుతోంది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ... నిన్న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ తో మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 15వేల పరుగులను పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ ఘనత సాధించాడు.
ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 15వేల పరుగులను పూర్తి చేసినవారిలో 33వ బ్యాట్స్ మన్ గా కోహ్లీ అవతరించాడు. అయితే, 50కి పైగా సగటుతో ఈ రికార్డును సాధించింది మాత్రం కోహ్లీనే. మరోవైపు నిన్నటి టీ20లో కోహ్లీ 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో, ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా (1,016 రన్స్) కోహ్లీ రికార్డును సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మెక్ కల్లమ్ (1,006) పేరిట ఉంది.