: స్టువర్టుపురం యువకుడికి కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ స్వర్ణం... అద్భుత ప్రతిభ చూపిన రాగాల వరుణ్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగుతేజం మెరిసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన రాగాల వరుణ్ 77 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ లు కలిపి వరుణ్ 269 కిలోల బరువును ఎత్తాడు. ఈ స్వర్ణంతో వరుణ్ ఇదే విభాగంలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు డైరెక్టుగా అర్హతను సాధించాడు. తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎర్ర దీక్షిత, 58 కిలోల జూనియర్ విభాగంలో 167 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం సాధించిన వరుణ్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. దీక్షితను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డి అభినందించారు.