: 'అయ్యో! నేను మడొన్నానే..' అన్నా నమ్మని కొరియర్ సంస్థ.. పాప్ సింగర్‌కు ఘోర అవమానం!
అమెరికా పాప్ సింగర్ మడొన్నాకు ఘోర అవమానం ఎదురైంది. ఆమె మడొన్నా కాదని అనుమానించిన డెలివరీ సర్వీస్ సంస్థ ఫెడెక్స్, ఆమెకొచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో తనకు జరిగిన అవమానంపై మడొన్నా ట్విట్టర్‌కెక్కింది. స్పందించిన పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలామంది ఆమెకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదో కఠినమైన ప్రపంచమని, ఇక్కడంతేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే.. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ తెచ్చిన తంటా వల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. మడొన్నా ట్విట్టర్ యుద్ధంపై స్పదించిన ఫెడెక్స్ ఉద్యోగి ఒకరు.. డెలివరీ అడ్రస్‌తోపాటు ఫోన్ నంబరును పంపాలని ట్వీట్ చేశాడు.