: హైదరాబాదు పాతబస్తీలో దారుణం...కత్తులు, బ్యాట్లతో దాడి


హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...పాతబస్తీలో డబీపురాలో గల గ్రాండ్ స్నూకర్ సెంటర్ లో క్యాషియర్ గా పని చేస్తున్న షబ్బీర్ హుస్సేన్ విధుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో గత అర్ధరాత్రి అకస్మాత్తుగా ప్రవేశించిన నఫీ, అమీర్, హైదర్ అతనిపై విరుచుకుపడ్డారు. ఒకరు కత్తితో ఆరుసార్లు పొడవగా, మిగిలిన ఇద్దరూ బ్యాట్లతో దాడికి దిగారు. ఒక వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపై కూడా దాడికి దిగే ప్రయత్నం చేయడంతో అతను వెళ్లిపోయాడు.

 మరో ఇద్దరు అక్కడే ఉన్నప్పటికీ అడ్డుకోలేకపోయారు. తీవ్రంగా గాయపడిన షబ్బీర్ హుస్సేన్ ను వారు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, సీసీ పుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News