: భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీ సేనది అరుదైన రికార్డు!


శ్రీలంక జట్టుపై టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన విజయంతో కోహ్లీ సేన అభిమానుల మనసు చూరగొంది. సిరీస్ ఆద్యంతం అద్భుతమైన ఆటతీరుతో జట్టు ఆకట్టుకుంది. భారతజట్టు అద్భుత ప్రదర్శనకు తోడు శ్రీలంక పేలవ ఆటతీరు ఆ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక్క టీ20 మ్యాచ్ లను గెల్చుకుని టీమిండియా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. గత కెప్టెన్లెవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ సేన సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత జట్టు జోరుకు శ్రీలంక తీవ్రమైన కష్టాల్లో పడిపోయింది. వరల్డ్ కప్ లో పాల్గొనాలంటే ఆ జట్టుకు రెండు విజయాలు అవసరం. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి లంకేయులు వెస్టిండీస్ తో ఆడనున్నారు. విండీస్ ది కూడా అదే పరిస్థితి. ఆ జట్టు విఫలమైతే శ్రీలంక, విండీస్ జట్లలో ఒకటే వరల్డ్ కప్ లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించి, లంక జట్టును పూర్తిగా కష్టాల్లోకి నెట్టింది. 

  • Loading...

More Telugu News