: నా ఆరోగ్యం బాగానే ఉంది.. వదంతులు నమ్మకండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


తన ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన శ్రేయోభిలాషుల నుంచి తనకు పరామర్శలు వస్తున్నాయని అన్నారు.

ఆరోగ్యం బాగుండని కారణంగా ప్రదర్శనలు రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందని తన శ్రేయోభిలాషులు చెప్పారని అన్నారు. దగ్గు, జలుబు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే తన ఆరోగ్యం బాగుండలేదని అనుకుని ఉంటారని అన్నారు. తన ప్రదర్శనల రద్దుకు కారణం.. తన సోదరి గిరిజ కన్నుమూయడమేనని, దాదాపు 12 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందని అన్నారు. ఈ సంఘటన తర్వాత సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చానని, ప్రస్తుతం ‘స్వరాభిషేకం’ షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టు చెప్పారు. తన ఆరోగ్యంపై వదంతులు సృష్టించి, ఎందుకు బాధ కల్గిస్తారో అర్థం కావడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News