: కొలంబో టీ20: ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బలు.. రెండు వికెట్లు ఔట్!
కొలంబో వేదికగా జరుగుతోన్న భారత్, శ్రీలంక ఏకైక టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే దెబ్బ తగిలింది. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి దిల్షాన్ మునవీర వచ్చాడు. మరో ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా 4.3 వ ఓవర్ వద్ద 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో దిల్షాన్ మునవీర 21 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక స్కోరు 46/2 గా ఉంది.