: 32 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాలికకు సుప్రీంకోర్టు అనుమతి!


అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక త‌న 32 వారాల గర్భాన్ని తొలగించుకుంటాన‌ని వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ముంబయి జేజే హాస్పిటల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమెకు ఈ నెల‌ 8న గర్భవిచ్చిత్తి చేయాలని తీర్పునిచ్చింది. అలాగే గర్భస్రావం చేసే ఒకరోజు ముందు మాత్రమే బాధిత చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించాల‌ని పేర్కొంది. స‌ద‌రు బాధితురాలు ముంబయికి చెందిన ఓ బాలిక‌. ఆమెపై ఆమె తండ్రి సన్నిహితుడు పలుసార్లు అత్యాచారం చేశాడు. ఆమె గ‌ర్భం దాల్చింద‌న్న విష‌యం ఆ బాలిక త‌ల్లిదండ్రుల‌కు నాలుగు వారాల తర్వాత తెలిసింది. ఆ బాలిక‌ను ఆమె తల్లి సంరక్షణ కేంద్రంలో ఉంచి మెడికల్‌ పత్రాలు సేకరించేందుకు ఇంత‌గా స‌మయం ప‌ట్టింది.   

  • Loading...

More Telugu News