: మ‌హేశ్ `స్పైడ‌ర్‌` మ‌ల‌యాళం టీజ‌ర్ విడుద‌ల‌... ఆర్‌జే బాలాజీ స్థానంలో ప్రియ‌ద‌ర్శి!


ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ న‌టించిన `స్పైడ‌ర్‌` సినిమా మ‌ల‌యాళం టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ టీజ‌ర్‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించిన విష‌యం ఏంటంటే... తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆర్‌జే బాలాజీ పోషించిన పాత్ర‌ను `పెళ్లిచూపులు` ఫేం ప్రియ‌ద‌ర్శి పోషించిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. తెలుగు, త‌మిళ టీజ‌ర్ల‌లో ఆర్‌జే బాలాజీ క‌నిపించిన చోట, మ‌ల‌యాళ టీజ‌ర్‌లో ప్రియ‌ద‌ర్శిని చూడొచ్చు. క‌థాంశం ప్ర‌కారం ఓ కీల‌క పాత్ర కోసం ఆర్‌జే బాలాజీని తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి మ‌ల‌యాళంలో కూడా అంతే ప్రాధాన్యమున్న పాత్రకి ప్రియ‌ద‌ర్శిని తీసుకున్నారా? లేక మ‌ల‌యాళం వెర్ష‌న్లో ఈ పాత్ర నిడివిని త‌గ్గించారా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News