: ఉదయభాను కవల కూతుళ్ల బర్త్ డే పార్టీ సందడి.. బాలకృష్ణ సహా సినీప్రముఖుల హాజరు!


ప్రముఖ యాంకర్ ఉదయభాను కవల కూతుళ్ల పుట్టినరోజు వేడుక ఇటీవల చాలా గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, బ్రహ్మానందం, జీవిత, నిర్మాత సుబ్బరామిరెడ్డి, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఉదయభాను-విజయ్ కుమార్ ప్రేమ వివాహం 2004లో జరిగింది. వారి దాంప్యతానికి గుర్తుగా పుట్టిన కవల కూతుళ్లలో ఒకరి పేరు యువి నక్షత్ర కాగా, మరో చిన్నారి పేరు భూమి ఆరాధ్య. ఆ చిన్నారులకు ఇది తొలి పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్ గా నిర్వహించామని ఉదయ్ భాను పేర్కొంది.

  • Loading...

More Telugu News