: వెలుగులోకి హనీప్రీత్ సీక్రెట్ డైరీ... ఎన్నో వివరాలు.. విశేషాలు!


హనీప్రీత్... ప్రస్తుతం అత్యాచార కేసులో జైలులో ఉన్న గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక. ఆమె పుత్రిక కాదని, వారి మధ్య అవాంఛనీయ సంబంధమే ఉందని హనీప్రీత్ భర్తే స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 20 ఏళ్ల క్రితం, అంటే తన పెళ్లికి ఓ ఏడాది ముందు 1998లో ఆమె రాసుకున్న డైరీ ఒకటి తాజాగా లభ్యమైంది. ఈ డైరీలో హనీప్రీత్ కు చెందిన పలు నిజాలు ఉన్నాయని చెబుతూ, ఓ టీవీ చానల్ డైరీని చూపింది.

ఇందులో రాతలు ఆమె స్వయంగా రాసిందా? అన్న విషయమై స్పష్టత లేనప్పటికీ, తన పేరు ప్రియాంకా తనేజా ఉరఫ్ అను అని రాసుకుంది. అను (ఏఎన్ యూ) అంటే అట్రాక్టివ్, నాటీ, అన్ఫార్చ్యునేట్లీ గర్ల్ అని రాసుకుంది. కాబోయే భర్త విశ్వాస్ గుప్తాను ప్రస్తావించింది. కాజోల్ ఫోటో అతికించుకుంది. అప్పటి సల్మాన్ చిత్రం 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' పోస్టర్ ను అతికించుకుంది. రామ్ రహీంపై తన అభిమానాన్ని తెలుపుతూ ఓ గీతాన్ని రాసింది. కొన్ని కవితలు కూడా ఈ డైరీలో ఉన్నాయి. డైరీలోని మొత్తం 103 పేజీలు తమకు లభ్యమైనాయని సదరు చానల్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News