: కేసీఆర్ కు కంటి ఆపరేషన్ సక్సెస్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఢిల్లీలో కేసీఆర్ ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను డాక్టర్ సచ్ దేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారంటూ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్ సచ్ దేవ్ కు ధన్యవాదాలు తెలిపారు.
కంటి ఆపరేషన్ కోసం గతంలో పలుసార్లు కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పటికీ... అనుకోని పనుల వల్ల ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 1వ తేదీని కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం జైట్లీతో భేటీ అయిన కేసీఆర్... ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకున్నారు. ఈరోజు ఆపరేషన్ చేయించుకున్నారు.