: మరో 40 రోజుల్లో భూ వాతావరణంలోకి రానున్న భారత ఉపగ్రహం.. ప్రమాదం లేదంటున్న ఇస్రో!


గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది రోదసిలో కొట్టుమిట్టాడుతోంది. మరో 40 లేదా 50 రోజుల్లో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుందని తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో అది పేలిపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం శర వేగంగా భూ వాతావరణం వైపు వస్తోంది. ఒకవేళ అది పేలిపోతే దాని శకలాలు ఎక్కడ పడతాయనే విషయంలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, అలాంటి ప్రమాదమేమీ ఉండబోదని ఇస్రో అంటోంది.

  • Loading...

More Telugu News