: రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు: కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్
రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ తెలిపింది. బెంగళూరులో ఆమె మాట్లాడుతూ, తాను రహస్య వివాహం చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాను పలు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని చెప్పింది. తనకు చాలా బాధ్యతలు కూడా ఉన్నాయని తెలిపింది. వివాహం జీవితంలో ముఖ్యమైన ఘట్టమని, రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని, తన వివాహానికి సన్నిహితులందరినీ ఆహ్వానిస్తానని, అందరి ముందు ఘనంగా వివాహం చేసుకుంటానని తెలిపింది. కాగా, కేరళకు చెందిన డ్యాన్స్ మాస్టర్ ను ఈమె వివాహం చేసుకుందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.