: ఇండియా అమ్ముల పొదిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మరో అస్త్రం... ఫోఖ్రాన్ లో పరీక్ష విజయవంతం!


భారత ఆయుధ గారంలో సరికొత్త ఆయుధం వచ్చి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అడ్వాన్స్‌ డ్‌ టోడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌ (ఏటీఏజీఎస్‌) ను అణ్వాయుధ పరీక్షా కేంద్ర మైన ఫోఖ్రాన్ లో నిపుణులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఏటీఏజీఎస్ ప్రపంచ రికార్డుతో అద్భుతమైన ఫలితం రాబట్టింది. 155 మిల్లీమీటర్ల 52 క్యాలిబర్‌ గన్‌ శతఘ్నిని పరీక్షించగా మూడు షెల్స్‌ 47.2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించాయి. ఇందుకోసం హైఎక్స్‌ ప్లోజివ్‌ బేస్‌ బ్లీడ్‌ (హెచ్ఈ-బీబీ ) శ్రేణి మందుగుండును వినియోగించారు. ఈ శ్రేణి ఆయుధాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన మందుగుండునే వినియోగిస్తారు. దీంతో అవి 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తాయి.

అయితే భారత్ ఆయుధగార సంస్థ డీఆర్డీఏ ఈ 155 ఎంఎం 52 క్యాలిబర్‌ శతఘ్నులను రెండు వేర్వేరు చోట్ల అభివృద్ధి చేసింది. తొలి భాగాన్ని టాటాపవర్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేయగా, రెండో భాగాన్ని ఫోర్జ్ ఇండియా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షలో టాటా పవర్‌ తో చేసిన నమూనా శతఘ్నిని పరీక్షించింది. ఇది 47.2 కిలోమీటర్ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఒక శతఘ్ని పనితీరును అది లక్ష్యాన్ని ఛేదించిన తీరును బట్టి నిర్ధారిస్తారు. గన్ పోజిషనింగ్ కూడా దీని పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ తరహా శతఘ్నులు 23 లీటర్ల సామర్థ్యంతో 15 టన్నుల బరువు ఉండగా, భారత్ తయారు చేసిన శతఘ్ని 25 లీటర్ల సామర్థ్యంతో 18 టన్నుల బరువుంది. దీని ధర ఒక్కోటి 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. భారత సైన్యానికి 2,000 శతఘ్నులు కావాల్సి ఉంది. దీంతో సుమారు 30,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఉత్పత్తి సంస్థలకు దక్కే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News