: మరో 48 గంటలు వానలే వానలు!


చత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 48 గంటలపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఏపీలోని కర్నూలు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News