: మయన్మార్ కు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభం.. మోదీ 'యాక్ట్ ఈస్ట్' పాలసీలో తొలి అడుగు


మయన్మార్ కు భారత్ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా 30 టన్నుల హై-స్పీడ్ డీజిల్ తొలి కన్ సైన్ మెంట్ బయలు దేరింది. మోదీ యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రమోషన్ లో ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. పొరుగు దేశాలతో హైడ్రో కార్బన్ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది.

 భారత్ కంటే ముందు మయన్మార్ దేశ అవసరాల కోసం థాయిలాండ్, సింగపూర్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునేది. దేశీయ శక్తి ఉత్పాదక రంగంలో పునరుత్పాదక శక్తి, విద్యుత్ శక్తి గణనీయంగా పెరిగింది. అదే సమయంలో రిఫైనింగ్ సెక్టార్ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు చమురు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఆ దేశాల అవసరాలు తీర్చడంతో పాటు సంబంధాలను పెంచుకోవడమే లక్ష్యం గా భారత్ అడుగులు వేస్తోంది.

  • Loading...

More Telugu News