: ఉదయం పది గంటలకు కేసీఆర్ కు కంటి ఆపరేషన్!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు కంటి ఆపరేషన్ చేయనున్నారు. ఇదివరకే వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్న కేసీఆర్ కు వైద్యులు నేడు కంటి ఆపరేషన్ చేయనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఉదయం పది గంటలకు కంటి ఆపరేషన్ చేయనున్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తారు.