: 1995లో మంత్రి కేటీఆర్ ఇలా ఉండేవారు!


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 22 ఏళ్ల క్రితం త‌న స్నేహితుల‌తో తీసుకున్న ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి త‌న స్నేహితుడు తాజాగా త‌న‌కు ఈ ఫొటో పంపాడ‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఫొటో త‌న‌కు 1995 నాటి రోజుల‌ను గుర్తుచేసింద‌ని అన్నారు. ఈ ఫొటోను కేటీఆర్ తన కాలేజీ రోజుల్లో దిగిన‌ట్లు తెలుస్తోంది. అందులో కేటీఆర్‌ గ‌ళ్ల చొక్కావేసుకుని స్నేహితుల మ‌ధ్య హుషారుగా క‌నిపిస్తున్నారు. కేటీఆర్ పోస్ట్ చేసిన ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది. 

  • Loading...

More Telugu News