: నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు అపర భగీరథులయ్యారు: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
నాడు ‘తెలుగు గంగ’ ద్వారా ఎన్టీఆర్, నేడు ‘పట్టిసీమ’ ద్వారా చంద్రబాబునాయుడు అపర భగీరథులయ్యారంటూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఈ రోజు హిందూపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, అక్టోబర్ నెలాఖరు నాటికి హంద్రీనీవా ద్వారా హిందూపురానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం ప్రజల అభిమానమే తనకు శ్రీరామరక్ష అని అన్నారు.