: ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం పూర్తి వివరాలివిగో!
2018 నుంచి 2022 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అంతర్జాతీయ టీవీ, డిజిటల్ హక్కులను రూ. 16,347.50 కోట్లకు స్టార్ ఇండియా సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. అలాగే ఏడు కేటగిరీలుగా విభజించిన ప్రాంతీయ టీవీ, డిజిటల్ మీడియా ప్రసార హక్కుల వివరాలను కూడా ఐపీఎల్ విడుదల చేసింది.
వీటిలో భారత్‌లో టీవీ ప్రసార హక్కులను సోనీ టీవీ రూ. 11,050 కోట్లకు గెల్చుకుంది. అలాగే భారత్‌లో డిజిటల్ ప్రసార హక్కులను రూ. 3,900 కోట్లకు ఫేస్‌బుక్, అమెరికా మీడియా హక్కులను రూ. 240.50 కోట్లకు పర్‌ఫామ్ గ్రూప్, యూరప్ మీడియా హక్కులను రూ. 48.75 కోట్లకు స్టార్ ఇండియా, ఆఫ్రికా ప్రసార హక్కులను రూ. 120.25 కోట్లకు సూపర్ స్పోర్ట్, మధ్యాసియా ప్రసార హక్కులను రూ. 390 కోట్లకు బెయిన్ స్పోర్ట్స్, ఆస్ట్రేలియా ప్రసార హక్కులను రూ. 70.01 కోట్లకు ఫాలోఆన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి.