: ఉపాధ్యాయ దినోత్సవం రోజునే టీచర్లపై లాఠీ ఝుళిపించిన పోలీసులు
దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటుండగా మరోవైపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాత్రం ఉపాధ్యాయులు లాఠీ దెబ్బలు తిన్నారు. అక్కడి టీచర్లంతా కలిసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ రోజు నిరసన చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, లక్నోలో శిక్షా ప్రేరక్ సంఘానికి చెందిన ప్రైవేటు టీచర్లు తమను క్రమబద్ధీకరించాలంటూ యూపీ విధాన సభ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టడానికి అక్కడకు చేరుకున్న పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అక్కడి నుంచి పంపించేశారు. పోలీసుల తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.