: మైకేల్ జాక్స‌న్‌ కు ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కొరియోగ్రాఫ‌ర్‌ ఫరాఖాన్!


ఈ రోజు ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని డ్యాన్స్‌లో త‌న‌కు ఆస‌క్తి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన మైకేల్ జాక్స‌న్‌తో దిగిన ఫొటోను ద‌ర్శ‌కురాలు, కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తాను ఫొటో దిగింది మైకేల్ జాక్స‌న్ మైన‌పు బొమ్మ‌తో కాద‌ని, `సిర్కా 1999` స‌మ‌యంలో మైకేల్ జాక్స‌న్ హాజ‌రైన‌పుడు దిగిన ఫొటోగా ఆమె పేర్కొన్నారు. ఫ‌రా మైకేల్‌తో ఫొటో దిగింద‌ని తెలిసి ఆమె అభిమానులు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. `గ్రేట్‌`, `సూప‌ర్బ్‌` అంటూ కామెంట్లు చేశారు.

ఫ‌రా ముంబైలో సోషియాల‌జీ చ‌దువుతున్న రోజుల్లో మైకేల్ జాక్స‌న్ `థ్రిల్ల‌ర్‌` ఆల్బం విడుద‌లైంది. అందులో మైకేల్ డ్యాన్స్ చూసి ఫ‌రా కొరియోగ్రాఫ‌ర్ అవ్వాల‌ని నిశ్చ‌యించుకుంద‌ట‌. త‌ర్వాత ఆమె `జో జీతా వ‌హీ సికంద‌ర్‌` సినిమాతో కొరియోగ్రాఫ‌ర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. త‌ర్వాత ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌గా ఆరుకి పైగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఎన్నో ఇత‌ర అవార్డులు గెల్చుకున్నారు ఫ‌రా. 2004లో `మై హూన్ న‌` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చారు. త‌ర్వాత `ఓం శాంతి ఓం`, `తీస్ మార్ ఖాన్‌`, `హ్యాపీ న్యూ ఇయ‌ర్‌` చిత్రాలకు ఫ‌రాఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

  • Loading...

More Telugu News