: జైల్లో హనీప్రీత్ నామజపం చేస్తున్న డేరా బాబా!
బాబా ముసుగులో సర్వ సౌఖ్యాలు అనుభవించి, పూజలందుకుని, ఇద్దరు సాధ్వీలను రేప్ చేసిన కేసులో జైలులో వున్న గుర్మీత్ రాం రహీం సింగ్ గగ్గోలు పెడుతున్నాడు. రోహ్ తక్ జైలులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్...హనీప్రీత్ నామజపం చేస్తున్నాడు. హనీ...హనీ...ఎక్కడున్నావ్? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలుస్తోంది. డేరా కార్యక్రమాలన్నీ బాబాతో కలసి సయుంక్తంగా పర్యవేక్షించే హనీప్రీత్ ఇన్సాన్ ను తన దత్తకుమార్తెగా గుర్మీత్ పేర్కొనే వాడు.
అయితే వారిద్దరి బంధం అసహజమైనదని ఆమె భర్తతో పాటు, పలువురు ఉద్యోగులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడని గుర్మీత్..హనీ నామజపం చేస్తున్నాడని ఖైదీలు చెబుతున్నారు. అలాగే హనీప్రీత్ తల్లి నసీబ్ కౌర్ ను కూడా కలవాలని భావిస్తున్నాడు. తన కుమారుడు జస్మీత్, కుమార్తెలు చరణ్ ప్రీత్, అమర్ ప్రీత్, అల్లుళ్లు షాన్ ఏ మీత్, రూహ్ ఏ మీత్, డేరా చైర్మన్ విపాసన, అనుచరుడు దాన్ సింగ్ లను కూడా కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.