: గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అభ్యంతరకర వీడియోల సమాచారం ఇవ్వాలని ఆదేశం!


ప్రముఖ సెర్చింజిన్లు గూగుల్, యాహూ, సోషల్  మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించి భారత్‌లో అందుకున్న ఫిర్యాదుల వివరాలను తమ ముందు ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు అందుకున్న ఫిర్యాదుల వివరాలు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తమకు తెలపాల్సిందిగా కోరింది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పీఓసీఎస్ఓ) 2012 చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చిందీ తెలపాలని జస్టిస్ మదన్ బి లోకూర్, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం హోమంత్రిత్వ శాఖను ఆదేశించింది.

హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓ 'ప్రజ్వల' అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుకు లేఖ రాస్తూ రెండు రేప్ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పంపించింది. దీనిని విచారణకు చేపట్టిన కోర్టు వాట్సాప్‌లో ఆ వీడియోలు అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సోషల్ సైట్లలో అభ్యంతరకర వీడియోలను బ్లాక్ చేయడానికి ఉన్న సాంకేతిక పరిష్కారాలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర, ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీ సోమవారం జరిగిన ఈ కేసు విచారణకు హాజరైంది. పబ్లిక్ డొమైన్‌ వివరాలు ఇచ్చేందుకు ఆయా సైట్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఓ కంపెనీ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ కమిటీ నివేదికలోని అంశాలు తెలిస్తే తప్ప ఆ వివరాలు ఇవ్వలేమని తెలిపారు. దీంతో స్పందించిన కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News