: మహిళా ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీ మాధవిని ఒక రాత్రంతా వేధించిన ఆకతాయిని అరెస్టు చేసిన పోలీసులు!


ఒక తాగుబోతు అర్ధరాత్రి చాలా సార్లు ఫోన్ చేసి తనను వేధించాడని, ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదని హైదరాబాదుకు చెందిన మహిళా ఇన్‌ స్పెక్టర్‌ లక్ష్మీ మాధవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో నిందితుడిని పట్టుకున్నారు. సీసీఎస్ పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి, మధ్యప్రదేశ్‌ లోని మొరానో జిల్లా దత్తాపుర గ్రామానికి చెందిన దుర్గేష్‌ కుమార్‌ అగర్వాల్‌ ను అరెస్ట్ చేశారు. ఇతని వేధింపుల జాబితా చాలా పెద్దదని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఇంటర్నెట్ చూస్తూ, అందులోని పోలీసు, రెవెన్యూశాఖలకు చెందిన అధికారుల నంబర్లను గుర్తించి, వారికి ఫోన్‌ చేసి వేధించడం ఇతని హాబీ అని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

ఇతని బాధితుల జాబితాలో పెద్దస్థాయి అధికారులున్నారని వారు తెలిపారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 20 మందిని వేధించినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఫోన్ వేధింపుల్లో ఆరితేరిన ఇతగాడి బాధితుల జాబితాలో నిజామాబాద్‌, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు, అసోం, బిహార్‌, గోవా, హర్యాణ, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసు అధికారులతో పాటు ఒక డీజీపీ, అదనపు డీజీపీ కూడా ఉండడం విశేషం. 

  • Loading...

More Telugu News